(Local) Tue, 17 Sep, 2019

టీమిండియా కోచ్ గా రవి శాస్త్రి పొడిగింపు

August 17, 2019,   11:23 AM IST
Views: 70
Share on:
టీమిండియా కోచ్ గా రవి శాస్త్రి పొడిగింపు

ఎట్టకేలకు టీమిండియా కోచ్ పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇండియా క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగిస్తున్నట్లు కపిల్ దేవ్ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటన చేశాడు. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ కోచ్ నియామకంపై నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి కపిల్‌ దేవ్‌ నాయకత్వం వహిస్తున్నారు. 2017 నుండి రవిశాస్త్రి టీమిండియా కోచ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు రెండో సారి మరో అవకాశం లభించింది. 2021 వరకు రవిశాస్త్రి కోచ్ గా కొనసాగనున్నారు.

సంబంధిత వర్గం
 యో-యో స్కోరును పెంచే యోచనలో రవి శాస్త్రి
 యో-యో స్కోరును పెంచే యోచనలో రవి శాస్త్రి
టీం ఇండియా  కొత్త కోచ్‌ కి ఇంటర్వ్యూలు ప్రారంభం
టీం ఇండియా కొత్త కోచ్‌ కి ఇంటర్వ్యూలు ప్రారంభం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.