(Local) Wed, 16 Oct, 2019

విశాఖ టెస్టులో రికార్డుల మోత

October 07, 2019,   11:58 AM IST
Share on:
విశాఖ టెస్టులో రికార్డుల మోత

విశాఖ టెస్టులో పలు రికార్డులు నమోదయాయ్యి. మొదటి సరిగా టెస్టుల్లో ఓపెనర్ గా అవతారం ఎత్తిన రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో ఓపెనర్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ముందు ఇన్నింగ్స్ నిర్మించిన అతను తరువాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో తృటిలో డబల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన షాట్ లతో రెచ్చిపోయి సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు.మయాంక్ అగర్వాల్: ఎక్కువగా అనుభవం లేని మయాంక్ మొదటి టెస్టులో ఓపెనర్ గా వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. చక్కటి టైమింగ్ తో, చూడముచ్చటైన షాట్ లతో రెచ్చిపోయాడు. మొదట సెంచరీని చేసి తరువాత  దాన్ని డబల్ సెంచరీగా మలిచి రికార్డు సృష్టించాడు. రోహిత్ తో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విశాఖ టెస్టులో అశ్విన్ మాయ చేసాడు. మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ లతో రెచ్చిపోయాడు. సఫారీలను దెబ్బగొట్టాడు. ఈ క్రమంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ లలో 350 వికెట్లను తీసిన బౌలర్ గా ముత్తయ్య మురళీధరన్ సరసన నిలిచాడు. వీరిద్దరూ ఈ ఫీట్ ను తామాడిన 66వ మ్యాచ్ లో సాధించడం గమనార్హం.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.