(Local) Mon, 17 Jun, 2019

అత్యధిక ఐపిఎల్‌ ఫైనల్స్‌ ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ

May 15, 2019,   11:07 AM IST
Share on:

టీ20ల్లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీకి తిరుగులేదు. ఉప్పల్‌ వేదికగా ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌శర్మకు ఇది 10వ ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.అత్యధిక ఐపిఎల్‌ ఫైనల్స్‌ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అశ్విన్‌, రోహిత్‌ శర్మ ఇద్దరూ ఇప్పటివరకు 10 ఐపిఎల్‌ ఫైనల్స్‌ ఆడారు. ఇక , ఈ జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన ధోని, సురేశ్‌రైనా14 ఐపిఎల్‌ ఫైనల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.