(Local) Fri, 15 Nov, 2019

ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకు పొట్టి క్రికెట్ చాలా కీలకం - రోహిత్ శర్మ

November 07, 2019,   3:28 PM IST
Share on:
ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకు పొట్టి క్రికెట్ చా ...

వన్డేలు, టెస్టు జట్లకు ఎంపిక చేసే ముందు ఆటగాళ్ల సత్తాను పరీక్షించేందుకు పొట్టి క్రికెట్ చాలా కీలకమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ల ఆటపై అంచనకు వచ్చేందుకు టి20 ఫార్మాట్‌ను మించిన వేదికగా మరోకటి లేదన్నాడు. వన్డేలు, టెస్టుల్లో ఆటగాళ్లను ఎంపిక చేసే ముందు ఈ ఫార్మాట్‌లో వారి ఆటను గమనించి ఓ అంచనకు రావొచ్చన్నాడు. టెస్టులు, వన్డేల్లో ఎంతో మెరుగ్గా ఉన్న టీమిండియా ఆ సత్తాను టి20 ఫార్మాట్‌లో కనబరచలేక పోతుందన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టి20లో, తాజాగా బంగ్లాదేశ్‌పై మొదటి మ్యాచ్‌లో ఓటమి దీనికి నిదర్శనమన్నాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు.అయితే అందివచ్చిన అవకాశాన్ని కొంత మంది మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారన్నాడు. మిగతావారు వరుస వైఫల్యాలతో కెరీర్‌ను తామంతట తామే పాడు చేసుకుంటున్నారని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇక, బంగ్లాదేశ్‌తో గురువారం జరిగే రెండో టి20 తమకు సవాలు వంటిదేనన్నాడు. ఇందులో గెలవాల్సిన ఒత్తిడి జట్టుపై నెలకొందన్నాడు. అయితే సవాళ్లను స్వీకరించడం తనకు కొత్తేమి కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలిచి తీరుతామనే నమ్మకం తనకుందన్నాడు. తొలి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లకు తావులేకుండా ఈసారి ముందుకు సాగుతామని రోహిత్ స్పష్టం చేశాడు. రెండో టి20ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్ పాల్గొన్నాడు.

సంబంధిత వర్గం
స్మిత్‌కు చేరువలో మయాంక్ ....
స్మిత్‌కు చేరువలో మయాంక్ ....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.