(Local) Mon, 21 Oct, 2019

డెలివరీ ముందు కూడా టెన్నిస్ ఆడాను - సానియా మీర్జా

September 15, 2019,   1:17 PM IST
Share on:
డెలివరీ ముందు కూడా టెన్నిస్ ఆడాను - సానియా మీర్జా

సోషల్  మీడియాలో అక్టీవ్ గా వుండే సానియా మీర్జా తాజాగా  తన ప్రెగ్నెన్సీ డేస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇజాన్ పుట్టే రెండ్రోజుల ముందు కూడా తాను టెన్నిస్ ఆడినట్లు తెలిపింది. ప్రస్తుతం ‘ది లవ్ లాఫ్ లైవ్ షో’ అనే ఎపిసోడ్ చేస్తోన్న సానియా.. ఇందులో తన ప్రెగ్నెన్సీ డేస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పనుంది. కడుపులో 9 నెలలు బిడ్డను మొయ్యలేకపోయానని, ఆసమయంలో అనారోగ్యం చెందినట్లు సానియా తెలిపింది. త్వరగా డెలివరీ కావాలంటే ఏం చెయ్యాలో తనకు తోచలేదని.. ఆ టెన్షన్, ఆ భారం నుంచీ ఉపశమనం పొందేందుకు టెన్నిస్ ఆడినట్లు సానియా పేర్కొంది. కనీసం అలా అయినా.. త్వరగా డెలివరీ అయిపోతుందేమోనని భావించానని, టెన్నిస్ ఆడినప్పుడు డెలీవరీ కాలేదు కానీ…  మానసికంగా కాస్త ఉపశమనం పొందానని సానియా చెప్పుకొచ్చింది. ఈ కొత్త షో ద్వారా తన ప్రెగ్నెన్సీకి సంబంధించి మరిన్ని విషయాలను సానియా అభిమానులతో పంచుకోనున్నట్లు తెలిసింది.

సంబంధిత వర్గం
వచ్చే ఏడాది జనవరి నుంచి  సానియా మీర్జా సెకండ్ ఇన్న ...
వచ్చే ఏడాది జనవరి నుంచి సానియా మీర్జా సెకండ్ ఇన్న ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.