(Local) Mon, 16 Dec, 2019

రోజర్ కప్ టోర్నమెంట్ నుండి తప్పుకున్న సెరీనా విలియమ్స్

August 13, 2019,   1:06 PM IST
Share on:
రోజర్ కప్  టోర్నమెంట్ నుండి తప్పుకున్న సెరీనా విలి ...

యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ముందు ఒక  టైటిల్‌నైనా దక్కించుకోవాలన్న సెరీనా విలియమ్స్ ఆశలు గాయం కారణంగా గల్లంతయ్యాయి. టొరంటోలో జరుగుతున్న రోజర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన టీనేజర్ బియన్సా ఆండ్రెస్కూతో తలపడిన సెరీనా వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మొదలైన 19 నిమిషాలకే పోటీనుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పటికి సెరీనా 13 పాయింట్లతో వెనుకబడి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పిన సెరీనా హటాత్తుగా తొలి సెట్ మధ్యలో విశ్రాంతి సమయంలో కుర్చీలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తాను పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది.

మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని కెరీర్‌లో 24 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్న 37 ఏళ్ల సెరీనాకు ఈ గాయం ఒక అశనిపాతమేనని చెప్పాలి. ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని తాను ఎంతగానో ప్రయత్నించిన  కానీ అది సాధ్యం కాలేదంటూ అతి కష్టం మీద తన అభిమానులకు సారీ చెప్పింది.ఈ ఏడాది తనకు చాలా కఠినమైన సంవత్సరమన్న సెరీనా అయితే ప్రయాణాన్ని కొనసాగించక తప్పదని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం గత ఏడాది చాలా రోజులు టెన్నిస్‌కు దూరంగా ఉండిన తర్వాత తిరిగి రాకెట్ పట్టిన సెరీనా ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. 

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.