(Local) Tue, 18 Feb, 2020

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్

October 05, 2019,   3:13 PM IST
Share on:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్

దక్షిణాఫ్రికా-భారత జట్టు మధ్య జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 131.2 ఓవర్లలో 431 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ప్రస్తుతం భారత జట్టు 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఎల్గర్, డికాక్ సెంచరీలతో కదం తొక్కారు. డూప్లెసిక్ ఒక్కడు హాఫ్ సెంచరీ చేయగా ముత్తుసామీ 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మిగితా బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టగా జడేజా రెండు వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ భారత జట్టు ప్రారంభించింది. టీమిండియా ఒక వికెట్ నష్టానికి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఏడు పరుగులు చేసి మహరాజ్ బౌలింగ్‌లో డూప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ శర్మ 24 పరుగులు చేశాడు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.