(Local) Thu, 18 Jul, 2019

ప్రపంచ కప్ : సెమిస్ వరకు భారత జైత్రయాత్ర

July 11, 2019,   11:53 AM IST
Share on:

120 కోట్ల మంది క‌ల‌ల సౌధం చెల్లాచెదురైంది. కప్ గెలిచేందుకు అడుగు దూరంలో ఓడిన వేళా.. లక్షలాది మంది అభిమానుల గుండెలు పగిలాయి. దీంతో మళ్ళీ త‌ప్ప‌ని మ‌రో నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌. ఇంగ్లండ్ వేదిక‌గా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఆరంభంలో హాట్ ఫేవ‌రెట్‌గా బ‌రిలో దిగిన టీమిండియా... వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థిని బెంబేలెత్తించిన టీమిండియా.. ఎదురు ప‌డాలంటే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించే ప‌రిస్థితిని ఎదుటి జ‌ట్టుకు క‌ల్పించిన టీమిండియా.. సెమీ ఫైన‌ల్‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెట్టిన టీమిండియా.. స‌గ‌టు అభిమాని ఆశ‌ల‌ను కుప్పకూల్చింది.

మూడోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌ల‌ని మురిసిపోయిన స‌గ‌టు భార‌తీయ క్రికెట్ ప్రేమికుడిని నిరాశ‌ల అగాథంలోకి నెట్టేసింది. మ‌రో నాలుగేళ్ల పాటు నిరీక్షించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని క‌ల్పించింది. ఆటలో గెలుపోటములు సహజం. కానీ ఈ ఓటమి, కోట్ల మంది భావోద్వేగాలతో కూడుకున్నది. టాపర్డర్ వైఫల్యం, వరుణుడి అంతరాయం, దావన్ దూరమవడం.. ఇలా ఒడిదుడుకులు ఎన్ని ఉన్నప్పటికీ భారత్ మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆడింది. టీమిండియా అద్భుతమైన పోరాట పటిమ, అల్‌రౌండ్‌ షోతో సెమీస్‌ వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చింది. సెమీస్ లో జడేజా అత్యుత్తమంగా ఆడుతూ ధోనీతో కలిసి చేసిన  గొప్ప పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆదివారం కివీస్‌, రెండో సెమీఫైనల్‌ విజేతతో ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.