(Local) Tue, 17 Sep, 2019

సచిన్,ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

August 20, 2019,   11:54 AM IST
Views: 107
Share on:
సచిన్,ధోని రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

మైదానంలో పరుగుల వరద కొనసాగిస్తూ మాజీ దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొడుతున్న కోహ్లీ... తాజాగా సోషల్ మీడియాలో కూడా ఓ రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో ఏ క్రికెటర్ కూ  లేనంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కోహ్లీ సంపాదించుకున్నాడు. సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మించి అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. ట్విటర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇలా మూడు ఖాతాల్లో విడివిడిగా 30 మిలియన్ల ఫాలోవర్స్‌ను కోహ్లీ కలిగి ఉన్నాడు. సచిన్‌ ట్విటర్‌లో 30.1 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 28 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 16.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. ఎంఎస్ ధోనీ ట్విట్టర్ లో 7.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 20.5 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 15.4 మిలియన్ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు.

సంబంధిత వర్గం
అవకాశం వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోండి - యువ ఆ ...
అవకాశం వచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోండి - యువ ఆ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.