(Local) Mon, 16 Sep, 2019

ప్రపంచ టీ20 కోసం టీం ఇండియా ప్రయోగాలు

September 11, 2019,   1:12 PM IST
Views: 31
Share on:
ప్రపంచ టీ20 కోసం టీం ఇండియా ప్రయోగాలు

ప్రపంచ టీ20కి ఎక్కువ సమయం లేనందున  టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.రానున్న సిరీస్లలో  యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్ధేశ్యంతో టీం ఇండియా కీలక ఆటగాళ్లకు విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌…తాజాగా కుల్దీప్‌, చాహల్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.

బౌలింగ్‌ విభాగంలో కాస్త వైవిద్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నాటికి యువ క్రికెటర్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్‌, చాహల్‌లు పొట్టి ఫార్మట్‌లో అసాధారణమైన బౌలర్లు. అందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే మాకున్న మిగతా బౌలింగ్‌ ఆప్షన్‌కు పరీక్షించాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువక్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీతో పాటు బ్యాట్స్‌ మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు వారి సత్తాను నిరూపించుకున్నారు. ఇక కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌లు కూడా పొట్టి ఫార్మట్‌లో వారి ప్రతిభను చాటుకున్నాడు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతోనే కుల్దీప్‌, చాహల్‌లను పక్కన పెట్టామని ఎంఎస్‌కె ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఆదివారం నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

సంబంధిత వర్గం
ధోని ప్లాన్ ఏంటి?
ధోని ప్లాన్ ఏంటి?
దక్షిణాఫ్రికాతో టి 20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక
దక్షిణాఫ్రికాతో టి 20 సిరీస్ కు భారత జట్టు ఎంపిక

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.