(Local) Sat, 24 Aug, 2019

అంతర్జాతీయ క్రికెట్ కు యువరాజ్‌ సింగ్‌ రిటైర్మెంట్‌

June 10, 2019,   2:03 PM IST
Share on:

2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.సోమవారం ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. యువీ రిటైరయ్యాక.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడట. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యువీ రిటైర్మెంట్‌ ప్రకటించినా.. ఎవరూ ఆశ్చర్యపడరు. ఎందుకంటే యువీ గతకొంత కాలంగా జట్టులోకి ఎంపిక కాని విషయం తెలిసిందే.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.