(Local) Mon, 20 Jan, 2020

హత్య కేసులో సియం యోగి ఆదిత్యనాథ్‌ కు ఊరట

July 17, 2019,   1:00 PM IST
Share on:
హత్య కేసులో సియం యోగి ఆదిత్యనాథ్‌ కు ఊరట

యుపి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎంపి, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు నుంచి ఊరట లభించింది. 1999వ సంవత్సరంలో మహరాజ్‌గంజ్‌ జిల్లాలో జరిగిన పోలీసు కానిస్టేబుల్‌ సత్యప్రకాశ్‌ యాదవ్‌ హత్య కేసులో సియం యోగి ఆదత్యనాథ్‌ నిందితుడు. సియంపై కేసు నమోదు చేసిన సిబిసిఐడి విచారణలో యోగికి హత్య కేసులో ప్రమేయం లేదని తేలింది. దీంతో 2018లో మహరాజ్‌ గంజ్‌ సిజేఎం కోర్టు యోగిపై కేసును తిరస్కరించింది. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని ఎంపి, ఎమ్మెల్యే కోర్టు కూడా ఈ కేసును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.