(Local) Tue, 20 Aug, 2019

కాల్పుల మోతతో దద్దరిల్లిన ఉత్తర బ్రెజిల్

May 20, 2019,   10:28 AM IST
Share on:

బ్రెజిల్‌లోని పారా రాష్ట్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెలెమ్‌ నగరంలోని ఓ బార్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకరాం.. 
కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.