(Local) Tue, 20 Aug, 2019

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేడీ కీలకపాత్ర పోషిస్తుంది -సస్మిత్‌ పాత్రా

May 20, 2019,   12:13 PM IST
Share on:

బీజూ జనతా దళ్‌ అధికార ప్రతినిధి సస్మిత్‌ పాత్రా మాట్లాడుతు నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేడీ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా ఐదోసారి ఒడిశాలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో 21 లోక్‌సభ స్థానాలకు గానూ బీజేడీకి 6 నుంచి 7 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. కానీ అది తప్పని రుజువైంది. ఆ సమయంలో తమ పార్టీ 14 లోక్‌సభ స్థానాలను గెలుచుకుందని గుర్తు చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.