(Local) Mon, 20 Jan, 2020

అయోధ్య కేసులో జూలై 31 వరకు మధ్యవర్తిత్వం

July 18, 2019,   1:19 PM IST
Share on:
అయోధ్య కేసులో జూలై 31 వరకు మధ్యవర్తిత్వం

అయోధ్య కేసుపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భూవివాదం సమస్య పరిష్కారంలో మరికొద్ది రోజులు మధ్యవర్తిత్వమే కొనసాగుతుందని చెప్పింది. జూలై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించాలని, దీనికి సంబంధించిన నివేదికను ఆగస్టు 1న ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. దాన్ని పరిశీలించిన పిమ్మట తదుపరి కార్యాచరణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 
అయోధ్య వివాదంలో సామరస్యంగా పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచ్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఐతే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.