(Local) Tue, 17 Sep, 2019

చంద్రుడి క‌క్ష్య‌లోకి విజ‌య‌వంతంగా చంద్ర‌యాన్‌ 2

August 20, 2019,   11:02 AM IST
Views: 107
Share on:
చంద్రుడి క‌క్ష్య‌లోకి  విజ‌య‌వంతంగా చంద్ర‌యాన్‌ 2

చంద్ర‌యాన్ 2 వ్యోమ‌నౌక త‌గిన వెలాసిటీతో క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ఇస్రో వ‌ర్గాలు తెలిపాయి .సుమారు 30 రోజుల ప్ర‌యాణం త‌ర్వాత చంద్ర‌యాన్ 2 నిర్ధేశిత క‌క్ష్య‌లోకి చేరుకున్న‌ది. అత్యంత క్లిష్ట‌మైన ఆప‌రేష‌న్‌ను ఇస్రో విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. లూనార్ ఆర్బిట్ ఇన్‌స‌ర్ష‌న్ ప్ర‌క్రియ ఇవాళ ఉద‌యం 9 గంట‌ల 2 నిమిషాల‌కు మొద‌లైంద‌ని ఇస్రో త‌న ట్వీట్‌లో చెప్పింది. సుమారు 1738 సెక‌న్ల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. 114 km x 18072 కిలోమీట‌ర్ల ఎత్తులో చంద్ర‌యాన్‌2 త‌న క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. ఇక చంద్రుడి ఉప‌రిత‌లానికి వంద కిలోమీట‌ర్ల ఎత్తులో , సుమారు 100 km X 30 కిలోమీట‌ర్ల దూరంలో త్వ‌ర‌లో చంద్ర‌యాన్‌2 మ‌రికొన్ని కీల‌క ప్ర‌క్రియ‌లు నిర్వ‌హిస్తుంది. ఇక్క‌డే ఆర్బిటార్ నుంచి విక్ర‌మ్ ల్యాండ‌ర్ వేరుప‌డ‌నున్న‌ది. ఆ త‌ర్వాత చంద్రుడి ఉప‌రిత‌లంపై ల్యాండ‌ర్ దిగుతుంది. సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై ల్యాండ‌ర్ దిగుతుంది.

 

సంబంధిత వర్గం
విక్రమ్ కోసం రంగంలోకి నాసా
విక్రమ్ కోసం రంగంలోకి నాసా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.