(Local) Thu, 28 May, 2020

రంజన్ గొగోయ్‌తో యూపీ ఉన్నతాధికారులు భేటీ

November 08, 2019,   8:02 PM IST
Share on:
రంజన్ గొగోయ్‌తో యూపీ ఉన్నతాధికారులు భేటీ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో శుక్రవారం యూపీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. అయోధ్య తీర్పు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీజేఐ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో యూపీ సీఎస్ రాజేంద్ర కుమార్ తివారీ సహా ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం యూపీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. యూపీ ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలను సీజేఐకు అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 15లోపు ఎప్పుడైనా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పారా మిలటరీ బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.