(Local) Thu, 28 May, 2020

అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కన్నాట్ ప్లేస్

July 11, 2019,   11:05 PM IST
Share on:
అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కన్నాట్ ప్లేస్

దేశరాజధాని న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రపంచలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 9వ స్థానాన్ని వరుసగా రెండో సారి సంపాదించుకుంది. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ ఓ నివేదికను వెల్లడించింది. దీనిలోని వివరాల ప్రకారం, ఢిల్లీ నడి మధ్యలో ఉన్న ఈ కన్నాట్ ప్లేస్‌లో వార్షిక అద్దె చదరపు అడుగుకు 144 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి స్థానాన్ని రెండోసారి హాంకాంగ్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ సంపాదించుకుంది. అక్కడ చదరపు అడుగుకు 322 అమెరికన్ డాలర్ల వార్షిక అద్దె ఉందని సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఢిల్లీ ప్రధాన మార్కెట్ కావడంతో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మొదటి పది స్థానాల్లో ఎప్పుడు స్థానం సంపాదిస్తూనే ఉందని సీబీఆర్ఈ అధికారి ఈ సందర్భంగా వెల్లడించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.