(Local) Mon, 16 Sep, 2019

డికె శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు ఇ.డి సమన్లు జారీ

September 11, 2019,   1:02 PM IST
Views: 20
Share on:
డికె శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు ఇ.డి సమన్లు జార ...

కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డికె శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. శివకుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీల్యాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 12న తమ ఎదుట హాజరు కావాలని ఇ.డి. ఆ సమన్లలో పేర్కొంది.ఈడీ అధికారులు మంగళవారం ఉదయం బెంగళూరు సదాశివ నగరలోని డీకే శివకుమార్ నివాసానికి వెళ్లారు.కుటుంబీకులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఐశ్వర్యకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నాటికి తమ విచారణకు హాజరు కావాలని, లేకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. ఐశ్వర్య పేరు మీద సుమారు 78 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం. నేషనల్ గ్లోబల్ కళాశాలలో ఐశ్వర్య ట్రస్టీగా ఉన్నారు

దీనితోపాటు 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీకే శివకుమార్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచినట్లు తేలింది. తన కుమార్తె పేరు మీద 108 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఆయన ధృవీకరించినట్లు నిర్ధారించారు. 22 సంవత్సరాల వయస్సున్న ఐశ్వర్య పేరు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి జమ అయ్యాయనే విషయంపై ఆరా తీయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీకే మరో కుమార్తె ఆరాధన, కుమారుడు ఆకాశ్ పేర్ల మీద పెద్దగా ఆస్తులు గానీ, నగదు గానీ లేనట్లు స్పష్టమైంది.
 

సంబంధిత వర్గం
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య
ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్య
దేశంలోని చట్టాలకన్నా రాజకీయ కక్ష చాలా బలమైనది
దేశంలోని చట్టాలకన్నా రాజకీయ కక్ష చాలా బలమైనది

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.