(Local) Fri, 03 Apr, 2020

అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..

November 29, 2019,   3:25 PM IST
Share on:
అద్దె ఇంటి వేటలో మాజీ ముఖ్యమంత్రి ..

మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చెయ్యడం తో అంతకముందు సీఎంగా వున్నా దేవేంద్ర  ఫడ్నవిస్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.ఈ క్రమం లో ఆయన ముంబయిలోనే ఒక అద్దె ఇంటికోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తుంది.వాస్తవానికి నాగ పూర్ కు చెందిన ఫడ్నవీస్ తన సొంతూరుకు వెళ్లకుండా తిరిగి ముంబాయి లోనే తన మకాం వేయాలని చూస్తున్నారు.2014 లో మహారాష్ట్ర సీఎం గా భాద్యతలు స్వీకరించిన ఆయన నాగపూర్ నుంచి ముంబై కి తన కుటుంబాన్ని షిఫ్ట్ చేశారు.ఆయన సతీమణి అమృత ముంబయి లోని యాక్సిస్ బ్యాంక్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తుండడం,ఆయన కుమార్తె కూడా ముంబయి లోనే చదువుకుంటుండడం తో ఆయన తిరిగి నాగపూర్ కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.

మహారాష్ట్ర సీఎం గా మరోసారి ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అసెంబ్లీ లో తన బలాన్ని నిరూపించుకోవడం లో విఫలమవడం తో వెంటనే ఆయన తనపదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.దీనితో సీఎం అధికారిక నివాసం అయిన మలబార్ హిల్‌లోని వర్ష బంగ్లా ను నిన్న మధ్యాహ్నం ఖాళీ చేసినట్లు ఓ ప్రభుత్వ అధికారి మీడియాకు వెల్లడించారు.దీనితో ఇప్పుడు ఆయన అద్దె ఇంటి వేటలో ఉన్నట్లు తెలుస్తుంది.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.