(Local) Mon, 20 Jan, 2020

నిర్మలా సీతారామన్ పై మండిపడుతున్న నెటిజన్లు

September 11, 2019,   3:18 PM IST
Share on:
నిర్మలా సీతారామన్ పై మండిపడుతున్న నెటిజన్లు

దేశంలోని యువత కార్లు కొనకుండా ఓలా, ఊబర్ తదితర క్యాబ్ సర్వీసులను ఆశ్రయించడం కూడా ఆటో రంగం కుదేలు కావడానికి ఒక ప్రధాన కారణమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దింతో ట్విట్టర్ లో ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ  యువత తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం వేళల్లో యువత ఎక్కువ ఆక్సిజన్ పీలుస్తారు కాబట్టి దేశంలో ఆక్సిజన్ సంక్షోభం తలెత్తవచ్చు అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, దాల్ రోటీకి బదులు పిజ్జా తింటారు కాబట్టే భారతదేశంలో వ్యవసాయ రంగం పడిపోయింది అని మరో నెటిజన్ నిర్మలా సీతారామన్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. పెళ్లికి బదులు సహజీవనాన్ని ఇష్టపడుతున్న యువతను బహిష్కరించండి..ఎందుకంటే దీని వల్ల బ్రాహ్మణులు, పండితులు, జోతిష్కులకు పని లేకుండా పోతోంది అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. యువత ఎల్‌పిజిని వాడుతున్నారు కాబట్టే కోల్ ఇండియా ఉత్పత్తి పడిపోయింది అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు.

సంబంధిత వర్గం
విదేశీ కార్యక్రమాల వల్ల పెట్టుబడులు రావు..!
విదేశీ కార్యక్రమాల వల్ల పెట్టుబడులు రావు..!
ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా దేశ ప్రజలు
ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా దేశ ప్రజలు

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.