(Local) Mon, 16 Sep, 2019

చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

September 11, 2019,   1:38 PM IST
Views: 36
Share on:
చింతమనేని ప్రభాకర్ అరెస్ట్

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో పోలీసులు అరెస్ట్ చేశారు. SC,ST అట్రాసిటీ కేసులో పోలీసులు చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. 12రోజులుగా అజ్ఞాతంలోవున్న చింతమనేనిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేనిని ఏలూరు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

భార్య అనారోగ్యంగా ఉండడంతో చింతమనేని ప్రభాకర్ బుధవారం నాడు ఆయన తన స్వగ్రామం దుగ్గిరాలకు వచ్చారు.ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్దకు చేరుకున్న చింతమనేని తండ్రి, పిల్లలను కలిసి కాసేపు మాట్లాడారు. తాను లొంగిపోతానని చెప్పినప్పటికీ.. పోలీసులు ఇంత హై డ్రామా ఎందుకు చేస్తున్నారని చింతమనేని ప్రశ్నించారు. చింతమనేని వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

సంబంధిత వర్గం
మాజీ స్పీకర్ కోడెల మృతి
మాజీ స్పీకర్ కోడెల మృతి
ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా ?
ఈ రాష్ట్రంలో నివసించే హక్కు మాకు లేదా ?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.