(Local) Fri, 23 Aug, 2019

పాకిస్తాన్‌లో హఫీజ్ సయీద్‌ అరెస్టు

July 17, 2019,   3:32 PM IST
Share on:

 ముంబయి పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమ్మాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్‌ని బుధవారం పాకిస్తాన్‌లోని గుజ్రన్‌వాలాలో పోలీసులు అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. ఉగ్రవాద కేసులను విచారించే కోర్టులో హాజరయ్యేందుకు లాహోర్ నుంచి గుజ్రన్‌వాలా వెళుతున్న సయీద్‌ని ఉగ్రవాద నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసినట్లు జియో న్యూస్ తెలిపింది. కాగా, సయీద్ అరెస్టు జమ్మాత్ ఉద్ దవా ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే ఏ అభియోగాలపై సయీద్‌ని అరెస్టు చేశారో తెలియదని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడానికి సంబంధించి అరెస్టు చేసి ఉంటారని రాయ్‌టర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.