(Local) Thu, 02 Jul, 2020

రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

May 21, 2019,   11:14 AM IST
Share on:
రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారాయి. తెలంగాణ వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు ఎండ తీవ్రతకు బెంబేలెత్తుతున్నారు. కూలీలు, కార్మికులు, ఉద్యో గులు వడదెబ్బల బారినపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సొమవారం ఒక రోజే వడదెబ్బ కారణంగా 15 మంది చనిపోయారు. రోజు రోజుకు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయువ్యలోని రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వైపు పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో ఇవాళ కూడ వడగాడ్పుల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 వడగాడ్పు రోజులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా కిలోమీటరు ఎత్తులో ఉపరితల ద్రోణి అవరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.