(Local) Thu, 02 Jul, 2020

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మదు - మమతా బెనర్జీ

May 20, 2019,   11:38 AM IST
Share on:
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మదు - మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్‌ సిఎం మమత బెనర్టీ ఎగిజట్‌ పోల్‌ల్స పేరుతో భారీ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. అయితే తాను ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విశ్వసించబోనన్నారు.ఈ వార్తలకు బాగా ప్రచారం కల్పించి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తారని, ఆ తర్వాత వేలాది ఈవీఎంలను ఒక చోటి నుంచి మరో చోటుకి తరలించే కుట్ర జరగబోతోందని ఆరోపించారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాలని, మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని మమత పిలుపునిచ్చారు. కాగా, నిన్న సాయంత్రం తుది విడత ఎన్నికల పోలింగ్ ముగియగానే వివిధ చానళ్లన్నీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్నీ ఎన్డీయే మరోమారు అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పాయి. ఎన్డీయేకు 300కు పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి. ఈ అంచనాలపై స్పందించిన మమత వాటిని నమ్మొద్దని ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.