(Local) Sat, 24 Aug, 2019

ఐసిజె తీర్పుపై స్పందించిన రాహుల్‌ గాంధీ

July 18, 2019,   1:51 PM IST
Share on:

మాజీ నౌకాదళ కుల్‌భూష్‌జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సోషల్‌ మీడియా వేదికగా తీర్పును స్వాగతించారు. తాజాగా రాహుల్‌ గాంధీ కూడా ఐసిజె తీర్పుపై స్పందించారు. ఈ తీర్పు జాదవ్‌ కుటుంబంలో కొత్త ఆశలను, నమ్మకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. 
ఐసిజె తీర్పును ఆహ్వినిస్తున్నానని, ఇప్పుడు తన ఆలోచనలన్నీ పాక్‌ జైల్లో ఉన్న కుల్‌భూషణ్‌ జాదవ్‌, భారత్‌లో అతడి కోసం ఎదురుచూస్తున్న ఆయన కుటుంబంతోనే ఉన్నాయి. ఈ తీర్పు వారికి అరుదైన క్షణమని అన్నారు. ఏదో ఒక రోజు జాదవ్‌ విడుదలై ఇంటికి తిరిగొస్తాడనే నమ్మకాన్ని కలిగించిందని రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.