(Local) Tue, 17 Sep, 2019

కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశం

August 23, 2019,   3:34 PM IST
Views: 63
Share on:
కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశం

 భారత ప్రధాని నరేంద్రమోడి మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో  ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌తో  భేటి అయ్యారు. ఇరువురు  దాదాపు 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ అంశంతో పాటు ద్వైపాక్షిక, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మెక్రాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని(మోదీ) కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారు.

అయితే కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాక్‌ల అంతర్గత అంశమని.. ఎలాంటి ఆందోళన పరిస్థితులకు తావివ్వకుండా చర్చించుకోవాలని, మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని స్పష్టం చేశానని తన వైఖరిని తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన చర్యలపైనా ఇరుదేశాధినేతలు చర్చించారు. శాంతి స్థాపనకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో కీలక పారిస్‌ ఒప్పందంలో భారత్‌ పాత్ర ఎనలేదని కొనియాడారు. అదే తరహాలో అంతర్జాతీయ అంశాల్లో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్‌ అభిప్రాయపడింది. అంతకు ముందు మోదీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఈ చర్చలు సాగుతాయని స్పష్టం చేశారు. ఉభయ దేశాల ప్రజల సుభిక్షమే లక్ష్యంగా మైత్రి కొనసాగుతుందన్నారు.

సంబంధిత వార్తలు
సంబంధిత వర్గం
మోడీ పుట్టినరోజుకి విలువైన మొక్కు  చెల్లించిన అభిమ ...
మోడీ పుట్టినరోజుకి విలువైన మొక్కు చెల్లించిన అభిమ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.