(Local) Thu, 06 May, 2021

కొత్త రకం జిహాద్ మొదలుపెట్టిన ఐసిస్!

November 07, 2019,   11:30 AM IST
Share on:
కొత్త రకం జిహాద్ మొదలుపెట్టిన ఐసిస్!

జిహాదీలో భాగంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో అడవులను తగలబెట్టండంటూ ISIS క్యాడర్‌కు దాని ప్రచార సంస్థ ‘ఖురేశ్‌’ పిలుపునిచ్చింది. అమెరికాలో ఇటీవల కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, అటు స్పెయిన్ లో చెలరేగిన కార్చిచ్చుతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాద సంస్థ అడవులను తగులబెట్టండంటూ పిలుపునివ్వడం గమనార్హం.
అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల్లో అడవులను తగులబెట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగించి  పర్యావరణ పరిస్థితులను దిగజార్చాలని ISIS సానుభూతిపరులకు సామాజిక మాధ్యమం ద్వారా పిలుపునిచ్చింది. పారిస్‌లోని నోటర్ డామ్ కేథడ్రల్‌ చర్చి గత ఏప్రిల్‌లో మంటల్లో చిక్కుకోవడం క్రైస్తవుల శాపంగా, తమ విజయంగా ఐసిస్ పేర్కొంది. సిరియాలో ఈ సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైనికులు హతమార్చినప్పటికీ ISIS తన పంథాను వీడలేదు. ఖలీఫా రాజ్యం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది.

సంబంధిత వర్గం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు  మరో అరుదైన గౌరవం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.