(Local) Mon, 16 Sep, 2019

ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును స్వీకరించిన ఇస్రో చైర్మన్‌

August 23, 2019,   1:45 PM IST
Views: 64
Share on:
ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును స్వీకరించిన ఇస్రో చైర ...

ప్రతిష్ఠాత్మక  ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి నుండి ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ కు గురువారం స్వీకరించారు. అవార్డు కింద ప్రశంసా పత్రం, గోల్డ్ మెడల్‌తో పాటు రూ.5లక్షల నగదును బహూకరించారు .స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఇవ్వాల్సిన  ఈ అవార్డును  కొన్ని అనివార్య కారణాలతో గురువారానికి వాయిదా వేశారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రతిష్ఠను పెంచుతున్న శివన్‌ను తమిళనాడు సర్కారు ఈ అవార్డకు ఎంపిక చేసింది.

చంద్రయాన్ -2తో పాటు సితార తదితర ప్రాజెక్టులు శివన్ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. అబ్దుల్ కలాం స్మారకార్థం 2015లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఈ అవార్డును ప్రకటించారు. శాస్త్రసాంకేతిక, విద్యార్థి, సేవా రంగాల్లో కృషి చేసిన వారికి ఈ అవార్డులు అందిస్తున్నారు.

సంబంధిత వర్గం
విక్రమ్ కోసం రంగంలోకి నాసా
విక్రమ్ కోసం రంగంలోకి నాసా

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.