(Local) Sat, 24 Aug, 2019

ఈ నెల 22న ‘చంద్రయాన్2' ప్రయోగం

July 18, 2019,   1:32 PM IST
Share on:

ఇస్రో ప్రతిష్ఠాత్మక  ప్రాజెక్ట్ ‘చంద్రయాన్2 ఈ నెల 15న ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ  నెల 22, సోమవారం నాడు నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. జూలై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్2 రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపింది. కాగా, రాకెట్ లో కనుగొన్న సాంకేతిక లోపాలను ఇప్పటికే సవరించామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా రాకెట్ ప్రయోగం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.