(Local) Thu, 13 Aug, 2020

మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్న జనసేన అధినేత

August 20, 2019,   8:41 PM IST
Share on:
మరోసారి తన గొప్ప మనస్సు చాటుకున్న జనసేన అధినేత

సెలబ్రిటీస్ అనే పదం అనేది కేవలం సినిమాలో యాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. బట్ మనసున్న మారాజు అనే మాట మాట్లాడాలి అంటే దానికి తగ్గ జాలి దయ ఉంటేనే పిలుస్తారు. ఇప్పుడిందాత ఎందుకు అనుకుంటున్నారా... కేన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని పాతకూటి బూడిగయ్యకు జనసేన చీఫ్, నటుడు పవన్ కల్యాణ్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. బూడిగయ్య త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షిస్తూ వినాయకుడి విగ్రహాన్ని అందించారు. ప్రకాశం జిల్లా అన్నసముద్రానికి చెందిన బూడిగయ్య పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తనకు కేన్సర్ వచ్చినప్పటికీ జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఇటీవల బూడిగయ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని స్థానికంగా  ఉండే జన సేన నేతలకు బూడిగయ్య చెప్పాడు. దీంతో వారు ఈ విషయాన్ని పవన్ కు తెలిపారు. ఈ క్రమంలో బూడిగయ్యను హైదరాబాద్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్నజనసేన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ పవన్ బూడిగయ్యను పరామర్శించారు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు ఎప్పుడూ అండగా ఉంటానని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

సంబంధిత వర్గం
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన
రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.