(Local) Sat, 24 Aug, 2019

మా ప్రభుత్వం బలమేంటో నిరూపించుకుంటాం - కుమారస్వామి

July 18, 2019,   1:16 PM IST
Share on:

కర్ణాటక విధాన సభలో విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. దీనిపై సిఎం కుమారస్వామి సభలో మాట్లాడారు. బలం నిరూపించుకునే సామర్థ్యం తమకుందని విశ్వాసం వ్యక్తం చేశారు.సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదని బిజెపి పగటి కలలు కంటోంది. ప్రభుత్వాన్ని నడపగలనా లేదా అన్న దానిపై నేనిక్కడికి రాలేదు. స్పీకర్‌ పాత్రను కూడా కొందరు సభ్యులు ప్రమాదంలో పడేశారు. ఆయనెప్పుడూ నిష్పక్షపాతంగానే వ్యవహరించారు. సవాళ్లు నాకేం కొత్త కాదు. ఇప్పుడు కూడా అంతే. ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. మా ప్రభుత్వం బలమేంటో నిరూపించుకుంటాం.

అందరిలాగే నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. నా మంత్రులకు నేను బాధ్యుడిగా ఉండాలి. నేను నా ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నాను. ఇలాంటివన్నీ చర్చించకుండా ఎలా ఉండగలను?. ఎవరికేం సందేహాలున్నాయో నేను తీర్చడానికే ఇక్కడికి వచ్చాను.మా ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా కుట్రపన్నుతుండటం నిజం కాదా?. వారి సహకారంతోనే అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకు వెళ్లారు. అధికార దాహంతో రాష్ట్రంలో బిజెపి గందరగోళం సృష్టిస్తోంది. రెబల్‌ ఎమ్మెల్యేలు నాపై అసత్య ఆరోపణలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మా ఆధిక్యాన్ని కచ్చితంగా నిరూపించుకుంటాం అని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.