(Local) Mon, 17 Jun, 2019

మీడియా స్వేచ్ఛ కట్టడికి కొత్త చట్టం -కుమారస్వామి

May 20, 2019,   10:56 AM IST
Share on:

మీడియా పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీఎం కుమారస్వామి మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం మైసూరులో పుస్తకాల విడుదలలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మీడియాతో సహవాసం డేంజర్‌ అన్నారు. అందుకే ఇటీవల కొన్ని రోజులుగా దూరంగా ఉన్నానన్నారు. మీడియాతో సన్నిహితంగా ఉన్న రాజకీయనేతలలో దేశంలోనే తాను ముఖ్యమైన వ్యక్తినన్నారు. ఇటీవల వారితో సన్నిహితంగా ఉండడం కూడా మంచిదికాదనే అనిపించేలా పరిస్థితి మారిందన్నారు. రాజకీయ నేతలను కామెడీ నటుల్లా మార్చేస్తున్నారన్నారు. మీడియా తీరుతో వారిపై ఉండే నమ్మకం లేకుండా పోయిందన్నారు. మండ్య ఎన్నికల్లో వారికి ఇష్టమొచ్చినట్టు చూపారని విచారం వ్యక్తం చేవారు. ఎలక్ట్రానిక్‌ మీడియా కథనాలతో నిద్రపట్టే అవకాశమే లేదనిపించేలా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాజంలో నిష్పక్షపాతంగా మీడియా వ్యవహరించాల్సి ఉండేదని కానీ ఇటీవలి పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. కాగా మీడియా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు ఓ చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.