(Local) Tue, 20 Aug, 2019

విశ్వాస పరీక్షకు నేను సిద్దమే -కమల్ నాథ్

May 21, 2019,   11:50 AM IST
Share on:

కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ చేసిన డిమాండ్‌పై కమల్నాథ్ స్పందించారు.విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగానే ఉన్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి, విశ్వాస పరీక్ష నిర్వహించాలని కోరుతూ బీజేపీ నేత గోపాల భార్గవ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కోరారు. విశ్వాస పరీక్షకు తాము సిద్ధంగా ఉన్నట్టు కమల్‌నాథ్ చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంటుందని, కాంగ్రెస్‌కు ఐదుకు మించి రావని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఈ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచీ బీజేపీ ఇవే ఆరోపణలు చేస్తోందన్నారు. గత ఐదు నెలల్లో నాలుగుసార్లు తాను మెజార్టీని నిరూపించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వారి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చని బీజేపీ నేతలకు హితవుపలికారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.