(Local) Tue, 20 Aug, 2019

కమల్ కు ముందస్తు బెయిల్ మంజూరు

May 20, 2019,   2:17 PM IST
Share on:

విశ్వనటుడు, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. తమిళనాడులోని అరవకురుచ్చిలో ఇటీవల కమల్ ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా తొలి ఉగ్రవాది హిందూవేనని, అది గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అంటూ కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కమల్ పై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ పై ఐపిసి సెక్షను్ల 153ఏ, 295ఏ కింద కేసు నమోదు చేశారు. కమల్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.