(Local) Thu, 27 Feb, 2020

రామాలయ నిర్మాణానికి బంగారు ఇటుక విరాళంగా ఇస్తా

August 19, 2019,   4:06 PM IST
Share on:
రామాలయ నిర్మాణానికి బంగారు ఇటుక విరాళంగా ఇస్తా

చివరి మొఘల్ సామ్రాజ్యాధినేత బహదూర్ షా జఫర్ వారసుడు హబీబుద్దీన్ టూసీ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బంగారు ఇటుక విరాళంగా అందచేయడానికి ముందుకొచ్చారు. అయితే బాబ్రీ మసీదు-రామ జన్మభూమి స్థలాన్ని తనకు అప్పగించాలని ఆయన షరతు విధిస్తున్నారు. 1529లో బాబ్రీ మసీదును నిర్మించిన మొదటి ముఘల్ రాజు బాబర్ వారసుడినైన తానే ఈ స్థలానికి నిజమైన యజమానినని ఆయన చెప్పుకుంటున్నారు.

వివాదాస్పద స్థలాన్ని సుప్రీంకోర్టు తనకు అప్పగిస్తే హిందువుల మనోభావాలను గౌరవించి తాను ఆ స్థలంలోనే రామాలయం నిర్మిస్తానని ఆదివారం నాడిక్కడ ఆయన మీడియాకు తెలిపారు. రామాలయాన్ని పడగొట్టి ఆ ప్రదేశంలో బాబ్రీ మసీదును బాబర్ నిర్మించాడని హిందువులు భావిస్తున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతుండగా అందులో తనను కూడా కక్షిదారుగా చేర్చాలని 50 ఏళ్ల యువరాజు టుసీ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరగవలసి ఉంది.

సంబంధిత వర్గం
బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిందిలా
బాబ్రీ మసీదు ధ్వంసం జరిగిందిలా

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.