(Local) Sun, 08 Dec, 2019

గోవాలో కుప్పకూలిన మిగ్‌-29కె శిక్షణ ఫైటర్‌ జెట్‌

November 16, 2019,   5:38 PM IST
Share on:
గోవాలో కుప్పకూలిన  మిగ్‌-29కె శిక్షణ ఫైటర్‌ జెట్‌

గోవాలో శనివారం నేవీకి చెందిన మిగ్‌-29కె శిక్షణ ఫైటర్‌ జెట్‌ నేల కూలింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. ట్రైనింగ్‌ సెషన్లో భాగంగా టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీనిపై నేవీ అధికార ప్రతినిధి వివేక్‌ మధ్వాల్‌ మాట్లాడుతూ 'మిగ్‌-293 ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందని, అందులో ఉన్న పైలెట్లు కెప్టైన్‌ ఎం. షియోకాంద్‌, లెప్టినెంట్‌ కమాండర్‌ దీపక్‌ యాదవ్‌ సురక్షితంగా తప్పించుకున్నారని తెలిపారు. కాగా  ప్రమాద స్థలి నుంచి వారిని రప్పించడానికి సిబ్బందిని పంపామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.