(Local) Tue, 20 Aug, 2019

వృద్ధులైన తల్లిదండ్రుల కోసం బిహార్ ప్రభుత్వం చట్టం

June 12, 2019,   2:01 PM IST
Share on:

వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని వారిని జైలుకు పంపించేందుకు బిహార్ ప్రభుత్వం చట్టం చేయబోతోంది. కని పెంచిన వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, పోషించకుండా వివిధ కారణాలతో వారిని దూరం పెడుతున్నారని, ఇటువంటి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బిహార్ సిఎం నితీశ్ కుమార్ ఈ చట్టం తీసుకరాబోతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారికి జైలు శిక్ష విధించే ముసాయిదా ప్రతిపాదనకు బిహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ ఆమోదం పొందాక ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం తేవడం వల్ల వృద్ధాప్యంలో అనాథలుగా మారే తల్లిదండ్రులకు కాసింత ఊరట లభించనుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.