(Local) Thu, 02 Jul, 2020

లెక్కింపు రోజున...విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు

May 21, 2019,   12:04 PM IST
Share on:
లెక్కింపు రోజున...విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవ ...

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు కౌంటింగ్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విజయవాడ,పెనమలూరులో ఓ లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఏవైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయన్న ఉద్దేశంతో అనుమానితులను ఇప్పటికే బైండోవర్ చేసినట్టు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్టు ద్వారకా తిరుమలరావు చెప్పారు.

ప్రశాంత వాతావరణంలో లెక్కింపు జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అంతకుముందు ఆయన లెక్కింపు రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఐదు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వివరించారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, లెక్కింపు కేంద్రం వెలుపల పోలీసుల బలగాలు ఉంటాయని సీపీ వెల్లడించారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.