(Local) Mon, 17 Jun, 2019

విపక్ష పార్టీల సమావేశానికి మాయావతి హాజరు కావడం లేదు - సతీశ్ చంద్ర మిశ్రా

May 20, 2019,   12:22 PM IST
Share on:

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఈరోజు యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీల సమావేశానికి హాజరు కావడం లేదని బీఎస్పీ సీనియర్ నాయకులు సతీశ్ చంద్ర మిశ్రా స్పష్టత ఇచ్చారు. ఇవాళ మాయావతి లక్నోలోనే ఉంటుందని, ఢిల్లీ వెళ్లడం లేదని ఆయన చెప్పారు. ఎన్డీఏనే మళ్లీ అధికారంలోకి వస్తుందని నిన్న వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీఏకు 300లకు పైగా, యూపీఏకు 120 స్థానాలకు పైగా వస్తాయని తెలిపాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఈసారి బీఎస్పీ, ఎస్పీ కూటమి వల్ల బిజెపి కి సీట్ల సంఖ్య తగ్గొచ్చని అన్ని సర్వేలు అంచనా వేశాయి.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.