(Local) Wed, 16 Oct, 2019

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

October 09, 2019,   1:26 PM IST
Share on:
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు ప్రకటన ప్రారంభమయ్యింది.  సోమవారం వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్‌ పురస్కారం దక్కింది. భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు పురస్కారాలు ప్రకటించారు. జేమ్స్ ఫిబెల్స్, మైకేల్ మేయర్, డైడియార్ క్యూలోజ్ లకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. 2019 సంవత్సరానికి గానూ ఈ ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించనుంది. వీరిలో పీబుల్స్‌ కెనడియన్‌ అమెరికాకు చెందిన శాస్త్రవేత్తకాగా.. మైఖేల్‌, క్యులోజ్‌లు స్విట్జర్లాండ్‌కు చెందినవారు. విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలు.. సూర్యుడిని పోలి ఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాన్ని కనుగొన్నందున వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. నోబెల్ ప్రైజ్‌మనీ 9.18 లక్షల అమెరికన్‌ డాలర్లలో సగం పీబుల్స్‌కు.. మిగిలిన ప్రైజ్ మనీ మైఖేల్‌, క్యులోజ్‌‌లకు అందజేస్తారు.

సంబంధిత వర్గం
కిరణ్ కుమార్ రెడ్డి విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్ ...
కిరణ్ కుమార్ రెడ్డి విధానాలే కేసీఆర్ అమలు చేస్తున్ ...
కర్రల సమరాన్ని నివారించండి
కర్రల సమరాన్ని నివారించండి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.