(Local) Fri, 19 Jul, 2019

కార్గో నౌక స్వాధీనం ఘోరమైన చోరీ -ఉత్తర కొరియా

May 15, 2019,   11:51 AM IST
Share on:

అమెరికా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఆ నౌక ప్రయాణించిందన్న నెపంతో ఇటీవల దాన్ని అమెరికా స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ చర్యను ఘోరమైన చోరీ అని పేర్కొంటూ ఉత్తర కొరియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది జూన్‌లో ఉత్తరకొరియా-అమెరికా చేసిన సంయుక్త ప్రకటన స్పూర్తిని పూర్తిగా తోసిపుచ్చేలా ఈ చర్య ఉంది. ఉత్తర కొరియాపై వీలైనంత ఒత్తిడి తెచ్చేలా అమెరికా తనదైన శైలిని మరింత విస్తృత పరుస్తూ ఈ చర్యకు పాల్పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ అధికారి అన్నారు. అమెరికా తన శక్తితో ఉత్తర కొరియాను అదుపుచేయొచ్చని అమెరికా అనుకోవడం చాలా తప్పుడు భావన అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.