(Local) Wed, 16 Oct, 2019

పాక్ ప్రధాని తీరుపై సౌదీయువరాజు ఆగ్రహం -‘ఫ్రైడే టైమ్స్’ సంచలన కథనం

October 08, 2019,   11:56 AM IST
Share on:
పాక్ ప్రధాని తీరుపై సౌదీయువరాజు ఆగ్రహం -‘ఫ్రైడే టై ...

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)కి వెళ్లేందుకు ఇటీవల తన సొంత విమానాన్ని ఏర్పాటు చేసిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ …ఆయన తీరుపట్ల అసంతృప్తితో చెందారట. అందువల్లే తన విమానాన్ని వెంటనే తిరిగి ఇమ్మని ఇమ్రాన్‌ను అడిగారని పాకిస్థానీ వీక్లీ ‘Friday Times’ ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. అమెరికా పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి న్యూయార్క్‌లో దిగాల్సి వచ్చింది. కానీ అసలు కారణం సాంకేతిక లోపం కాదట. పాకిస్థాన్ చేరకుండా అక్కడే తన విమానాన్ని తనకు అప్పగించాలని సౌదీ యువరాజు డిమాండ్ చేశారు.UNGA వెళ్లే ముందు ఇమ్రాన్ సౌదీలో రెండు రోజులు పర్యటించారు. తర్వాత కమర్షియల్ విమానంలో అమెరికా వెళ్లాలని ఇమ్రాన్ అనుకున్నారు. కానీ యువరాజు సల్మాన్ ఇమ్రాన్‌పై అభిమానంతో ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే న్యూయార్క్‌లో ఇమ్రాన్ వ్యవహరించిన తీరు యువరాజుకు నచ్చలేదు. ఇమ్రాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, మలేసియా ప్రధాని మహతిర్‌తో మహ్మద్‌తో ఇస్లాం దేశాల గురించి మాట్లాడడం, తను చెప్పకుండా ఇరాన్ నాయకులతో చర్చించడంపై యువరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తన విమానాన్ని వెంటనే తిరిగి ఇమ్మని యువరాజు అడిగినట్టు ఫ్రైడే టైమ్స్ ప్రచురించింది.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.