(Local) Tue, 17 Sep, 2019

పాక్ ఆర్మీ చీఫ్ పదవి కాలం పొడిగింపు

August 20, 2019,   11:29 AM IST
Views: 61
Share on:
పాక్ ఆర్మీ చీఫ్  పదవి కాలం పొడిగింపు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ జావేేద్ బజ్వా పదవీ కాలన్నీ మూడేళ్ల పాటు పొడిగించారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ పదవీకాలాన్ని పొడిగించినట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన వారం రోజులకే పాక్ ఆర్మీ చీఫ్ పదవీకాలన్నీ మూడేళ్ల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇతర దేశాలకు ఫిర్యాదు చేస్తోంది. పాక్ విన్నపాన్ని అంతర్జాతీయంగా ఎవరూ లెక్కచేయకపోవడంతో కుమిలిపోతూ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తూ భారత్ పై విషం చిమ్ముతుంది.

సంబంధిత వర్గం
పాక్ ఆక్రమిత కశ్మీర్ వెనక్కి తేవడమే లక్ష్యం..!
పాక్ ఆక్రమిత కశ్మీర్ వెనక్కి తేవడమే లక్ష్యం..!

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.