(Local) Mon, 16 Sep, 2019

కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై పాక్ సెనెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

August 23, 2019,   4:30 PM IST
Views: 58
Share on:
కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై పాక్ సెనెటర ...

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన వ్యవహారంపై పాక్ సెనేటర్ రెహ్మాన్ మాలిక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో మోదీ అక్రమ చర్యలకు నిరసనగా గళం విప్పినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని రెహ్మాన్ మాలిక్ అన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని తొలగించడాన్ని ప్రశ్నించడంతో పాటు, అక్కడి అణగారిన ప్రజల తరఫున గొంతుక వినిపించడం కూడా ఆయన అరెస్ట్‌కు కారణమైందని పేర్కొన్నారు. ఈమేర ఆయన ట్వీట్ చేస్తూ.. “గుర్తుంచుకోండి, మీ తర్వాతి ప్రధాని చిదంబరమే. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న రాజకీయవేత్త చిదంబరం” అంటూ రెహ్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.

సంబంధిత వర్గం
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్
నేనే కశ్మీర్‌లో పర్యటిస్తా : జస్టిస్ గొగోయ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.