(Local) Tue, 17 Sep, 2019

భూటాన్ తో పది ఎంఒయులను కుదుర్చుకున్న భారత్

August 19, 2019,   3:35 PM IST
Views: 98
Share on:
భూటాన్ తో పది ఎంఒయులను కుదుర్చుకున్న భారత్

రెండు రోజుల భూటాన్ పర్యటన నిమిత్తం  భూటాన్  వెళ్లిన భారత ప్రధాని నరేంద్రమోడీ  తన పర్యటన సందర్భంగా 10 ఎంఒయులను మోడీ కుదుర్చకున్నారు. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, రూపే కార్డులను మోడీ ప్రారంభించారు. అదేవిధంగా దక్షిణాసియా ఉపగ్రహానికి గ్రౌండ్ స్టేషన్ ను మోడీ ప్రారంభించారు. రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ లో మోడీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భూటాన్ కు భారత్ అండగా ఉంటుందని మోడీ ఆ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ రాజదంపతులు మోడీకి విందు ఇచ్చారు. తన పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో మోడీ భారత్ కు బయల్దేరారు.

సంబంధిత వర్గం
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహాన్ని సందర్శించ ...
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహాన్ని సందర్శించ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.