(Local) Wed, 16 Oct, 2019

ఎస్‌పిజి భద్రతలో మార్పులు

October 08, 2019,   11:53 AM IST
Share on:
ఎస్‌పిజి భద్రతలో మార్పులు

ప్రముఖులకు భద్రత కల్పించడంలో ప్రత్యేక భద్రతా బృందానికి (SPG ) కేంద్ర ప్రభుత్వం సోమవారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎస్‌పిజి భద్రత పొందుతున్న వారికి ఎస్‌పిజి సిబ్బంది ఇకపై నిరంతరం అంటే వారు విదేశాలకు వెళ్లినా కూడా… తప్పనిసరిగా భద్రత కల్పించాలి. ఇంతవరకు ఎస్‌పిజి సిబ్బంది ప్రముఖులు గమ్యస్థానం చేరడంలో తొలిదశ వరకే భద్రత కల్పిస్తున్నారు. అలాగే భద్రత పొందుతున్న వారు కూడా తాము విదేశాలకు వెళ్లినప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్లుతున్నారు,ఏ సమావేశానికి హాజరవుతున్నారో ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించాలి. అలాగే రక్షణ పొందుతున్నవారు గతంలో జరిపిన కొన్ని పర్యటనల సమాచారం కూడా అందించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఎస్‌పిజి నలుగురికి మాత్రమే …ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే రక్షణ కల్పిస్తోంది. ఈ నిబంధనల్ని వారు అంగీకరించకుంటే …భద్రతా కారణాల దృష్టా వారి విదేశీ పర్యటనల్ని కుదిస్తామని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే కీలకమైన తరుణంలో రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనపై విమర్శలు రావడంతో ఎస్‌పిజి భద్రతలో మార్పులు చేశారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.