(Local) Mon, 20 Jan, 2020

ట్రంప్‌తో పాకిస్థాన్‌ ప్రధాని సమావేశం

July 18, 2019,   1:54 PM IST
Share on:
ట్రంప్‌తో పాకిస్థాన్‌ ప్రధాని సమావేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ నెల 22న వైట్‌ హౌస్‌లో సమావేశం కానున్నారు. అంతకు ముందు రోజు వాషింగ్టన్ డీసీలో పాకిస్థాన్ కమ్యూనిటీతో కలిసి ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. వాషింగ్టన్‌లోని కేపిటల్ ఎరీనాలో ఈ నెల 21న ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
అయితే అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించేందుకు సోమవారం అంతర్జాతీయ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది.

అయితే, ట్రంప్‌తో సమావేశానికి ముందు సయీద్‌ను అరెస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాషింగ్టన్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ నిర్వహించనున్న ర్యాలీకి నిరసన సెగ తగిలేలా కనిపిస్తోంది. ఇమ్రాన్ ర్యాలీని అడ్డుకునేందుకు అసమ్మతి గ్రూపులు సిద్ధమవుతున్నాయి. ముహాజిర్లు, బలోచ్ గ్రూపులతోపాటు భుట్టోజర్దారీ అనుకూల వర్గాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మద్దతుదారులు ఈ ర్యాలీలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.