(Local) Sat, 24 Aug, 2019

 ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితా విడుదల

July 18, 2019,   2:02 PM IST
Share on:

బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ ఇండిక్స్‌  ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాను ఇటివల విడుదల చేసింది. ఈ జాబితాలో ఆమెజాన్‌ సీఈవో జెఫ్‌బెజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటిస్థానంలో ఉండగా ,రెండో స్థానంలోఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. 107 బిలియన్‌ డాలర్లతో మూడవ స్థానంలో బిల్ గేట్స్ వున్నారు. రెండో స్థానంలో నిలిచినా  ఆర్నాల్డ్‌ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్‌ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్‌ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆర్నాల్ట్‌ తొలిస్థానంలో నిలిచారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్‌ డాలర్లు. ప్రపంచ వ్యాప్తంగా 13 వస్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత స్థానంలో విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ 20.5 బిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ శివ నాడార్‌ 92 స్థానంలో, కొటాక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కొటాక్‌ 96స్థానంలో నిలిచారు.

మహిళల్లో నాలుగో స్థానం మెకంజీదే

జెఫ్‌ బెజోస్‌తో విడాకులు తీసుకున అతని భార్య మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్‌ నిలిచారు.


 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.