(Local) Mon, 16 Sep, 2019

చిదంబరానికి సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట

August 23, 2019,   2:44 PM IST
Views: 69
Share on:
చిదంబరానికి సుప్రీం కోర్టులో తాత్కాలిక ఊరట

ఐఎన్ఎక్స్ స్కామ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం అత్యున్నత స్థానం తీర్పునిచ్చింది. ఆగస్ట్ 26 వరకు అరెస్ట్ చెయ్యకూడదని తన తీర్పులో పేర్కొంది. ఇదిలా ఉంటే ఆగస్ట్ 26 వరకు సీబీఐ కస్టడీకి చిదంబరాన్ని అనుమతి ఇస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో చిదంబరం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. కపిల్ సిబల్ బలమైన వాదనలు వినిపించారు. సీబీఐ నిబంధనలు పాటించలేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమన్నారు. చిదంబరం అరెస్ట్‌ అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈడీ ఎలాంటి అఫిడవిట్‌ దాఖలు చేయలేదని చెప్పారు. ఈడీ నోటీసులో ఎలాంటి సాక్ష్యాలు లేవన్నారు. ముందస్తు బెయిల్‌పై ఢిల్లీ కోర్టు తీర్పును ప్రస్తావించిన సిబల్.. ఈడీ నోటీసును ఢిల్లీ హైకోర్టు జడ్జి మక్కీకి మక్కీ కాపీ చేశారన్నారు. ఈ సందర్భంగా చిదంబరానికి 17 అంతర్జాతీయ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని సీబీఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వర్గం
ఇక పై సామాజిక మాధ్యమాలకు కూడా ఆధార్
ఇక పై సామాజిక మాధ్యమాలకు కూడా ఆధార్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.